*****మాతృదేవోభవ***** Mātṛdēvōbhava in sanskrit means Mother is God. To recognise and honor the divine qualities in mothers and to treat them with love, respect, and reverence.
Press Release Notes
Explore Indian Praja Congress National Party's latest updates and announcements...
దేశాన్ని ప్రధమ స్థానంలోకి తీసుకురావడమే పార్టీ లక్ష్యం
సౌత్ ఇండియా ఇన్ చార్జి కె పద్మాకర్ ఐజాక్
కడప సిటి మార్చి 18 : సూర్య న్యూస్: దేశాన్ని అన్ని రకాలు గా ప్రధమ స్థానంలోకి తీసుకురావడమే తమ పార్టీ లక్ష్యమని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ (ఐపిసి) జాతీయ ప్రధాన కార్యదర్శి, సౌత్ ఇండియా ఇన్ చార్జి, ఏపి సిఎం అభ్యర్థి కె. పద్మాకర్ ఐజాక్ అన్నారు.గత ఆదివారం స్థానిక నబీకోటలో ఉన్న రోజమ్మ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఏర్పా టు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ నేడు రైతులు అనేక సమస్యలు ఎదు ర్కొంటున్నా రని చెప్పారు.రైతాంగం దేశానికి వెన్నెముక అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.యువత ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నారని చెప్పారు తమ పార్టీని 2019 సంవత్సరం లో స్థాపించారు అన్నారు. నేడు ప్రజలు సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.దేశంలో రాష్ట్రంలో అవినీతి, నిరు ద్యోగ, తాండవిస్తోందిని విమర్శిం చారు. తమ పార్టీ మాతృదేవోభవ అనే నినాదంతో తల్లి లాంటి పాత్ర పోషిస్తున్నారు. ప్రజలకు ఉచిత విద్య , వైద్యం అందిస్తామని అన్నారు. భూమిలేని ప్రతి పౌరుడికి కనీసం 25 సెంట్లు సాగుభూమి ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు అగ్రికల్చర్ లో అవగా హన కల్పించి వ్యవసాయ రంగంలో రాణించేలా కృషి చేయడమే తమ పార్టీ ఉద్దేశం అన్నారు. ఆంధ్రప్రదేశ్ సిఎం అభ్యర్థి గా నన్ను ఎన్నుకోవ డం జరిగిందని చెప్పారు. తాను కేవలం ప్రజా సేవకోసంమే రాజకీ యాల్లోకి రావడం జరిగింది అందరి నీ సమానంగా చూసే పార్టీ తమదే నని అన్నారు. పేద ప్రజలకు మేలు చేయడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు రాష్ట్రంలో పూర్తిగా మధ్య పానం నిషేధం చేస్తామని పేర్కొన్నా రు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఆ యా విద్యార్హతలు బట్టి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. తనను పార్టీ పెద్దలు ఏపి సిఎం అభ్యర్థిగా ప్రకటించారని పులివెందుల, పిఠాపురం, కుప్పంలలో తాను పోటీ చేస్తానని పద్మాకర్ ఐజాక్ పోటీ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాలకి, 25 ఎంపీ స్థానాలకు గట్టి పోటీ ఇస్తూ, అన్ని స్థానాల్లో గెలిచే విధంగా ప్రజలను మేలుకొలు పుతామని వివరించారు. గతంలో దీనికి మాజీ మంత్రి మారెప్ప దీనికి నేతృత్వం వహించే వాడని ఆయనే పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్య క్షులు కె.బి. శ్రీధర్ కు సిఫార్సు చేసి ఈ పదవిని ఇప్పించారని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సమా వేశంలో సభ్యులు దొండ్ల సుబ్బా రాయుడు షేక్ జరీనా తదితరులు పాల్గొన్నారు